id stringlengths 1 3 | poem stringlengths 89 220 | label int64 0 6 | label_name stringclasses 7
values |
|---|---|---|---|
427 | కొమ్మ కన్నుఁగవకుఁ గోరగింపఁగఁ బూచి
తఱుచుజొత్తు గ్రక్కుదాసనంబు
గవియునీతమాలగహనాంధకారవి
తానమునకు నుదయభానుఁ డయ్యె. | 6 | ఆటవెలది |
149 | ఒకనికై యిట్లు కుల మెల్ల నుక్కడింప
నెత్తికొనఁ జూచె దిది నీతియే నృపాల!
వినుము; నామాట; నీ సుయోధనుని విడిచి
కులము రాజ్యంబుఁ దేజంబు నిలుపవయ్య. | 5 | తేటగీతి |
37 | ఆ యీశుఁడ నంతుఁడు హరి
నాయకుఁ డీ భువనములకు, నాకున్, నీకున్,
మాయకుఁ బ్రాణివ్రాతము
కీ యెడలన్ లేద యీశ్వరేతరము సుతా! | 0 | కందం |
173 | హరికరుణాతరంగిత కటాక్ష నిరీక్షణ లబ్ధ శౌర్య వి
స్ఫురణఁ దనర్చి తన్ను నని బోయగతిన్ గిరిశుం డెదర్చినం
పరవశ మొప్పఁగా గెలిచి పాశుపతాస్త్రముఁ గొన్న శత్రు భీ
కరుఁడు ధనంజయుండు సుభగస్థితి మోదము నొందుచుండునే? | 2 | చంపకమాల |
103 | తప మనఁగ మత్స్వరూపము
తపమను తరువునకు ఫలవితానము నే నా
తపముననే జననస్థి
త్యుపసంహరణము లొనర్చుచుండుదుఁ దనయా! | 0 | కందం |
239 | అంతట లీలఁబోలె జగదాత్ముఁడు యజ్ఞవరాహమూర్తి య
త్యంత గభీర భీషణ మహార్ణవతోయ సమూహమున్ ఖురా
క్రాంతముఁ జేసి క్రమ్మఱ ధరాతలమంబులమీద నిల్పి వి
శ్రాంతి వహింపఁ జేసి గుణశాలి దిరోహితుఁ డయ్యె నయ్యెడన్. | 1 | ఉత్పలమాల |
390 | కుశలతయే వ్రతముల నగు
నశనాయాపీడ నింద్రియనిరోధమునన్
గృశుఁడవయి యాత్మ నలఁచుట
సశరీరస్వర్గసుఖము సమకొనియుండన్. | 0 | కందం |
499 | కందువ మాటలు, సామెత
లందముగాఁ గూర్చిచెప్ప నది తెనుఁగునకున్
బొందై, రుచియై, వీనుల
విందై, మఱి కానిపించు విబుధుల మదికిన్ | 0 | కందం |
208 | నీవు మహానుభావుఁడ వనింద్యచరిత్రుఁడ విట్టిచోట రా
జీవభవుండు దా విధినిషేధము లాత్మ నెఱుంగఁ డయ్యె నీ
భావభవప్రసూన శర బాధితుఁ డై తన కూఁతుఁ బొందెఁబో
వావిదలంపలే కనుచు వారక లోకులు ప్రువ్వఁ దిట్టరే. | 1 | ఉత్పలమాల |
254 | పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ. | 2 | చంపకమాల |
523 | కొందఱు డగ్గఱ నోడిరి,
కొందఱు సాహసము చేసి కోదండముతో
నందంద పెనఁగి పాఱిరి
సందుల గొందులను దూఱి, సత్త్వము లేమిన్. | 0 | కందం |
417 | పాటన సేయమిన్ గురులు పైఁబడి శీర్ణపటీరపంకలా
లాటిక మై దరస్మితవిలాసపుఁజంద్రిక డొంకి వాడుటన్
దేటఁదొఱంగి విన్న నగునీమొగమోయన మాసిచంద్రుఁడో
పాటలగంధి వ్రాలె నదె భానురుచిన్ దనకందు మీఱఁగన్. | 1 | ఉత్పలమాల |
194 | చారు పటీర హీర ఘనసార తుషార మరాళ చంద్రికా
పూర మృణాళహార పరిపూర్ణ సుధాకర కాశ మల్లికా
సార నిభాంగ శోభిత భుజంగమతల్పము నందు యోగని
ద్రారతిఁ జెంది యుండు జఠరస్థిత భూర్భువరాది లోకుఁ డై. | 1 | ఉత్పలమాల |
188 | విదురుఁడు దురితావనిభృ
ద్భిదురుఁడు మునివరునిఁ జూచి ప్రియము మనమునం
గదురఁగ నిట్లని పలికె న
తి దురంతం బయిన విష్ణుదేవుని మహిమన్. | 0 | కందం |
63 | వికటముగ నిజపదాహతిఁ
బ్రకటముగా మూఁడు నెలల బాలకుఁడై యా
శకటనిశాటుని నంతక
నికటస్థునిఁ జేసె భక్తనికరావనుఁడై. | 0 | కందం |
471 | పవి పుష్పంబగు నగ్నిమంచగు నకూపారంబు భూమీస్థలం
బవు, శత్రుండతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలిలోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్
శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా! | 3 | మత్తేభము |
117 | పొలుపగు సకల విలక్షణ
ములు గల యాద్యంత శూన్యమును నిత్యమునై
లలి సూక్ష్మమై మనో వా
క్కులకుం దలపోయఁగా నగోచర మగుచున్. | 0 | కందం |
362 | కాని ప్రయోజనంబు సమకట్టదు తా భువి నెంత విద్యవాఁ
డైనను దొడ్డరాజు కొడుకైన నదెట్లు; మహేశుపట్టి వి
ద్యానిధి సర్వవిద్యలకు, దానె గురుండు వినాయకుండు దా
నేనుఁగు రీతి నుండియు నదేమిటి కాడఁడు పెండ్లి? భాస్కరా! | 1 | ఉత్పలమాల |
388 | అంధునకుఁ గొఱయె వెన్నెల
గంధర్వాంగనలపొందు గా దని సంసా
రాంధువునఁ బడియె దకట ది
వాంధము వెలుఁగు గని గొంది నడఁగినభంగిన్. | 0 | కందం |
143 | వారితండ్రి పాలు వారికి నొసఁగి నీ
పాలు సుతుల కెల్లఁ బంచియిచ్చి
చలము విడిచి ధర్మ మలవడ నీ బుద్ధిఁ
జొనుపవయ్య! కులము మనుపవయ్య! | 6 | ఆటవెలది |
436 | ఈమర్యాదకు నీవొడంబడిన మే లీభంగి గాదేని మా
భూమిన్ జేరఁగ నెట్లు నీయెడలితోఁ బోవంగ లేనే కదా
యీమందాకినిపొంత నీమునులతో నీవృక్షవాటంబులో
భామా యేఁ దప మాచరింతు విధి కబ్రహ్మణ్యమున్ బెట్టుచున్. | 4 | శార్దూలము |
207 | చాలుఁ బురే సరోజభవ! సత్పథవృత్తిఁ దొఱంగి కూఁతు ని
ట్లాలరి వై రమింప హృదయంబునఁ గోరుట ధర్మరీతియే
బేలరి వైతి నీ తగవుఁ బెద్దతనంబును నేలపాలుగా
శీలము వోవఁదట్టి యిటుసేసిన వారలు మున్ను గల్గిరే? | 1 | ఉత్పలమాల |
456 | నిన్నున్నమ్మినరీతినమ్మనొరులన్, నీకన్న నాకెన్నలే
రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు నా
యన్నా! యెన్నడు నన్ను సంస్కృతి విషాదాంభోధి దాఁటించి య
చ్ఛిన్నానంద సుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీకాళహస్తీశ్వరా! | 4 | శార్దూలము |
526 | శివుని చివుకు విల్లు శీఘ్రంబె యలనాఁడు
విఱిచినాఁడ ననుచు విఱ్ఱవీఁగ
వలదు, నేఁడు నాకు వశమైన యీ చాప
మెక్కు పెట్టి తివియు మింతె చాలు. | 6 | ఆటవెలది |
483 | అంతా సంశయమే శరీర ఘటనంబంతా విచారంబె లో
నంతా దుఃఖపరంపరాన్వితమె మేనంతా భయభ్రాంతమే
యంతానాంత శరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
జింతన్నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా! | 4 | శార్దూలము |
33 | బహు పా దోరు భు జాన నేక్షణ శిరఃఫాలశ్రవోయుక్తుఁడై
విహరించున్ బహుదేహి దేహగతుఁడై; విద్వాంసు లూహించి త
ద్బహురూపావయవంబులన్ భువనసంపత్తిన్ విచారింతు; రా
మహనీయాద్భుతమూర్తి యోగిజన హృన్మాన్యుండు మేధానిధీ! | 3 | మత్తేభము |
277 | పాపము లొందువేళ రణపన్నగ భూత భయజ్వరాదులన్
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్
బ్రాపుగ నీవుదమ్ము డిరుపక్కియలన్ జని తద్విపత్తి సం
తాపము మాంపి కాతురట దాశరథీ కరుణాపయోనిధీ. | 1 | ఉత్పలమాల |
54 | రామున్ మేచకజలద
శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవసు
త్రామున్ దుష్టనిశాటవి
రాముం బొమ్మనియెఁ బంక్తిరథుఁ డడవులకున్. | 0 | కందం |
255 | పండిత రక్షకుం డఖిల పాపవిమోచను డబ్జసంభవా
ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండకో
దండకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ
దండలు గాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ! | 1 | ఉత్పలమాల |
317 | చేతులకు దొడవు దానము,
భూతలనాథులకు దొడవు బొంకమి ధరలో,
నీతియె తొడవెవ్వారికి,
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ | 0 | కందం |
418 | ఇనుఁ డస్తాద్రికిఁ బోవఁ గొల్లగొని నేఁ డేతేరఁ దద్దీప్తి నం
జనసంబంధజబాంధవంబున రతిశ్రాంతాంగనానేత్రకో
ణనికాయంబుల డాఁచితద్ధవళిమన్ దాఁ బూనెనో చొప్పుమా
ర్ప ననన్ వెల్వెలఁబాఱె దీపకళికావ్రాతంబు శాతోదరీ. | 3 | మత్తేభము |
426 | వెలఁది యిచ్చటిసంపెంగవిరులు గహన
దేవతలయిండ్ల నెత్తినదీపశిఖలు
గాక యుండినఁ బంచబంగాళ మగుచుఁ
బాఱునే మత్తమధుకరపటలతమము. | 5 | తేటగీతి |
478 | ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టార్థంబులీ నేర్తురే
వేళన్ వారి భజింప జాలిబడకావిర్భూతమోదంబునన్
గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింప కీ
శ్రీలెవ్వారికిఁ గూడఁబెట్టెదవయా, శ్రీకాళహస్తీశ్వరా! | 4 | శార్దూలము |
202 | రుద్రునిచేత నీగతి నిరూఢమతిన్ సృజియింపఁ బడ్డ యా
రుద్రగణంబు లోలి నవరుద్ధత విశ్వము మ్రింగె నమ్మహో
పద్రవశాంతి కై యజుఁడు భర్గులఁ జూచి "కుమారులార! మీ
రౌద్ర విలోక నానల భరంబునఁ గ్రాఁగె సమస్త లోకముల్. | 1 | ఉత్పలమాల |
343 | అనఘుని కైనఁ జేకుఱు ననర్హునిఁ గూడి చరించునంతలో
మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే
యనువుననైనఁ దప్పవు యదార్థము; తానది యెట్టులన్నచో
నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా! | 2 | చంపకమాల |
235 | తలఁప రసాతలాంతరగతక్షితిఁ గ్రమ్మఱ నిల్పినట్టి నీ
కలితన మెన్న విస్మయము గాదు సమస్త జగత్తు లోలి మై
గలుగఁగఁ జేయు టద్భుతము గాక మహోన్నతి నీ వొనర్చు పెం
పలరిన కార్యముల్ నడప నన్యులకుం దరమే? రమేశ్వరా! | 2 | చంపకమాల |
85 | హరిఁ బరమాత్ము నచ్యుతు ననంతునిఁ జిత్తములం దలంచి సు
స్థిరత విశోక సౌఖ్యములఁ జెందిన ధీనిధు లన్యకృత్యము
ల్మఱచియుఁ జేయనొల్లరు ;తలంచిన నట్టిదయౌ; సురేంద్రుఁడుం
బరువడి నుయ్యి; ద్రవ్వునె పిపాసితుఁడై సలిలాభిలాషితన్? | 2 | చంపకమాల |
224 | జలమధ్యంబున లీనమొందిన ధరాచక్రంబు నే నేర్పునన్
నిలుపన్ వచ్చును బూర్వ మందు జగముల్ నిర్మించు నాఁ డాది న
ప్పులఁబుట్టించిన మీఁద నవ్వసుమతిం బుట్టించితిం బుత్ర య
ప్పులలోఁగ్రుంకి రసాతలాంతరమునం బొందెం గదా పృథ్వియున్ | 3 | మత్తేభము |
259 | కొంజకతర్క వాదమను గుద్దలిచే బరతత్త్వ భూస్ధలిన్
రంజిల ద్రవ్వి కన్గొనని రామ నిధానము నేడు భక్తి సి
ద్ధాంజనమందు హస్తగత మయ్యె భళీ యనగా మదీయహృ
త్కంజమునన్ వసింపుమిక దాశరథీ కరుణాపయోనిధీ. | 1 | ఉత్పలమాల |
348 | ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మ దలంచి యుగ్రవా
క్పరుషత జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం
బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ
స్థిరతరపౌరుషంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! | 2 | చంపకమాల |
115 | వనజోదరునవతార క
థనముఁ దదీయానువర్తితతి చారిత్రం
బును విస్తరించి పలుకం
జను నవి యీశానుకథలు సౌజన్యనిధీ! | 0 | కందం |
489 | తెల్లని పుండరీకముల తేజము మెచ్చని కన్నుదోయితో
నల్లని శక్రనీలరుచి నవ్వెడు కోమల దేహకాంతితో
నల్లినఁ బిల్లఁ గ్రోవి కర మంచిత సంజ్ఞల నింపునింపఁగా
గొల్లతలన్ విరాళి తగఁ గొల్పెడు కృష్ణుఁడు ప్రోచుఁ గావుతన్ | 1 | ఉత్పలమాల |
554 | అనుచుఁ బలుకుచున్న నా యార్తనాదంబు
విని జటాయు వనెడి విహగ నాథుఁ
డరుగుదెంచి, కలహ మత్యుగ్రముగఁ జేయ
రావణుండుఁ బక్షిరాజుఁ దాకెఁ. | 6 | ఆటవెలది |
191 | పాదవిభేదంబున మ
ర్యాదలును దఱుఁగు నధర్మ మాకొలదినె యు
త్పాదిల్లి వృద్ధిఁ బొందు ధ
రాదివిజులు పాద బుద్ధి రతు లగుదు రిలన్. | 0 | కందం |
558 | పొడగని గుండె ఝల్లుమన బుద్ధిఁ గలంగుచు రామచంద్రుఁ డ
య్యెడఁ గడు నుగ్రుఁడై పలికె నీ విటు నా కడ కేల వచ్చి? త
క్కడ నినుఁ బర్ణశాల కడఁ గావలి యుంచిన చోట, నొంటిమైఁ
బడఁతుక డించి రాఁదగునె వన్య మృగోత్కర మధ్య సీమకున్ | 2 | చంపకమాల |
61 | రావణు నఖిల జగద్వి
ద్రావణుఁ బరిమార్చి నిలిపె రక్షోవిభుఁగా
రావణుననుజన్ముని నై
రావణసితకీర్తి మెఱసి రాఘవుఁ డెలమిన్. | 0 | కందం |
373 | ఉల్లలదలకాజలకణ
పల్లవితకదంబముకుళపరిమళలహరీ
హల్లోహలమదబంభర
మల్లధ్వను లెసఁగ విసరె మరుదంకురముల్. | 0 | కందం |
240 | మంగళమైన యీ కథ సమంచితభక్తి బఠింప విన్నవా
రిం గరుణార్ద్రదృష్టిఁ గని శ్రీహరి సాల బ్రసన్నుఁ డౌను స
త్సంగతుఁ డైన విష్ణుఁడు ప్రసన్నుఁడు దా నగునేని వారికిన్
మంగళముల్ లభించు ననుమానము లే దదిగాక వెండియున్. | 1 | ఉత్పలమాల |
109 | చనుదెంచి తండ్రికిం బ్రియ
మొనరఁగ శుశ్రూషణంబు లొనరిచి యతఁడుం
దన దెసఁ బ్రసన్నుఁ డగుటయుఁ
గని భగవన్మాయ దెలియఁగా నుత్సుకుఁడై. | 0 | కందం |
495 | చెప్పుమని రామచంద్రుఁడు
సెప్పించిన పలుకుమీదఁజెప్పెద నే నె
ల్లప్పుడు నిహపరసాధన
మిప్పుణ్య చరిత్ర, తప్పులెంచకుఁడు కవుల్ | 0 | కందం |
422 | ఏల దురంతవేదనమెయిన్ బొరలాడెదు తాల్మి దక్కి మే
లే లలితాంగి యెంతపని లెమ్మిది విప్రవరుండు గోలయున్
బాలుఁడు గాన నప్పటికిఁ బైఁబడఁ గొంకెనుగాని వానికిన్
గా లొకచోట నిల్చునె వగన్ మగుడన్ నినుఁ జూచునంతకున్. | 1 | ఉత్పలమాల |
363 | కామిత వస్తుసంపదలు గల్గు ఫలం బొరు లాసపడ్డచో
నేమియుఁ బెట్టఁడేని సిరి యేటికి నిష్ఫలమున్నఁ బోయినన్
బ్రామికపడ్డ; లోకులకుఁ బండగ నే మది యెండి పోవఁగా
నేమి ఫలంబు చేఁదు విడదెన్నటికైన ముసిండి భాస్కరా! | 1 | ఉత్పలమాల |
377 | మృగమదసౌరభవిభవ
ద్విగుణితఘనసారసాంద్రవీటీగంధ
స్థగితేతరపరిమళ మై
మగువపొలుపుఁ దెలుపునొక్కమారుత మొలసెన్. | 0 | కందం |
52 | ధరణీ కంటకులైన హైహయనరేంద్రవ్రాతమున్ భూరివి
స్ఫురితోదారకుఠారధారఁ గలనన్ ముయ్యేడు మాఱుల్ పొరిం
బొరి మర్దించి, సమస్త భూతలము విప్రుల్ వేఁడఁగా నిచ్చి తాఁ
జిర కీర్తిన్ జమదగ్నిరాముఁ డన మించెం దాపసేంద్రోత్తమా! | 3 | మత్తేభము |
512 | కొందఱు కపి వంశంబునఁ
గొందఱు భల్లుక కులమున గురు బలయుతులై
యందఱు నన్ని తెఱంగుల
బృందారకులార! పుట్టి పెరుగుఁడు భువిపై. | 0 | కందం |
160 | కని యనురాగ వికాసము
దన మనమునఁ దొంగలింపఁ దగ గాఢాలిం
గన మాచరించి నెయ్యం
బునఁ గుశలప్రశ్న సేసి ముదమునఁ బలికెన్. | 0 | కందం |
306 | కరణముల ననుసరింపక
విరసంబున దిన్న తిండి వికటించు జుమీ
యిరుసున కందెన బెట్టక
పరమేశ్వరు బండి యైన బారదు సుమతీ | 0 | కందం |
204 | భగవంతుం బురుషోత్తమున్ హరిఁ గృపాపాథోధి లక్ష్మీశ్వరున్
సుగుణభ్రాజితు నచ్యుతుం బరుఁ బరంజ్యోతిం బ్రభున్ సర్వభూ
తగణావాసు నధోక్షజున్ శ్రితజనత్రాణైకపారీణు నా
జగదాత్ముం గనుచుందు రార్యులు తపశ్శక్తిన్ స్ఫుటజ్ఞానులై. | 3 | మత్తేభము |
308 | కసుగాయ గఱచి చూచిన
మసలక పస యొగరు రాక మధురంబగునా;
పస గలుగు యువతులుండగ
పసి బాలల బొందువాడు పశువుర సుమతీ | 0 | కందం |
476 | పాలుంబువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా! యన్న లే
లే లెమ్మన్న నరంటిపండ్లుఁగొని తేలేకున్న నే నొల్లనం
టే లాలింపరె తల్లిదండ్రులపుడట్లే తెచ్చి వాత్సల్య ల
క్ష్మీ లీలావచనంబులం గుడుపరా శ్రీకాళహస్తీశ్వరా! | 4 | శార్దూలము |
332 | పాలసునకైన యాపద
జాలింబడి తీర్ప దగదు సర్వజ్ఞునకున్
తేలగ్ని బడగ బట్టిన
మేలెఱుగునె మీటు గాక మేదిని సుమతీ | 0 | కందం |
411 | పాలఁ బుట్టినమాత్రాన మేలిగుణము
నేఁడు నీ కేల గల్గునో నీరజారి
నీటఁ బుట్టినవాఁడు కాఁడోటు వహ్ని
గాల్చుచున్నాఁడు జగ మెల్లఁ గరుణ లేక. | 5 | తేటగీతి |
297 | ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్
నొప్పించక, తా నొవ్వక,
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ | 0 | కందం |
539 | ఖరుఁడు వచ్చినట్టి కలకలం బాలించి,
రాఘవుండు తనదు రమణియొద్దఁ
దొలఁగ కుండ ననుజుఁ దోడుగాఁ గాఁపుంచి,
బెదర కంతఁ గలని కెదిరి నిలిచె | 6 | ఆటవెలది |
391 | అనినఁ బ్రవరుండు నీ వన్న యర్థ మెల్ల
నిజము కాముకుఁ డైనవానికి నకాముఁ
డిది గణించునె జలజాక్షి యెఱిఁగితేని
నగరమార్గంబుఁ జూపి పుణ్యమునఁ బొమ్ము. | 5 | తేటగీతి |
404 | ఆరూఢస్థితిఁ జంద్రికాధవళితాజాండంబులోఁ జంద్రుఁ డొ
ప్పారెన్ గాలభిషగ్వరుం డవిరతం బై కాముకశ్రేణికిన్
మారోత్సాహము నిల్వఁ బాదరసమున్ బంధించి గ్రాసార్థమై
క్షీరస్థాలికఁ బెట్టినట్టి గుటికాసిద్ధౌషధంబో యనన్. | 4 | శార్దూలము |
203 | మీ సృష్టి సాలు నింకన్
ధీసత్తములార! వినుడు ధృతి మీరు తపో
వ్యాసంగచిత్తు లై చనుఁ
డా సన్మంగళము లగు దృఢంబుగ మీకున్. | 0 | కందం |
395 | పాటున కింతు లోర్తురె కృపారహితాత్మక నీవు త్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొను మంచు జూపి య
ప్పాటలగంధి వేదననెపం బిడి యేడ్చెఁ గలస్వనంబుతో
మీటిన విచ్చు గుబ్బచనుమిట్టల నశ్రులు చిందువందఁగన్. | 1 | ఉత్పలమాల |
107 | అరయఁగఁ గల్పప్రళయాం
తరమున నాద్యంత విరహితక్రియతోడం
బరిపూర్ణ నిత్య మహిమం
బరమాత్ముఁడనై సరోజభవ యే నుందున్. | 0 | కందం |
303 | కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ | 0 | కందం |
380 | చూచి ఝళంఝళత్కటకసూచితవేగపదారవింద యై
లేచి కుచంబులున్ దుఱుము లేనడు మల్లలనాడ నయ్యెడన్
బూచినయొక్కపోఁకనునుబోదియఁ జేరి విలోకనప్రభా
వీచికలన్ దదీయపదవీకలశాంబుధి వెల్లి గొల్పుచున్. | 1 | ఉత్పలమాల |
309 | కవి కాని వాని వ్రాతయు,
నవరస భావములు లేని నాతుల వలపున్,
దవిలి చను పంది నేయని
వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ | 0 | కందం |
568 | ఇన కులాధీశ! సుగ్రీవుఁ డనెడువాఁడు
కపికులశ్రేష్ఠుఁ డత్యంత ఘనుఁడు తలఁప
నతనితోఁ బొత్తు గావింపు మన్ని పనులుఁ
జక్క నౌటకు నాత్మ నిస్సంశయంబు. | 5 | తేటగీతి |
521 | గురు భుజ శక్తి గల్గు పదికోట్ల జనంబులఁ బంప, వారు నా
హరుని శరాసనంబుఁ గొనియాడుచుఁ బాడుచుఁ గొంచు వచ్చి, సు
స్థిరముగ వేదిమధ్యమునఁ జేర్చిన, దానికి ధూప దీపముల్
విరులును గంధ మక్షతలు వేడుక నిచ్చిరి చూడ నొప్పుగన్. | 2 | చంపకమాల |
36 | అనఘా! విశ్వము నెల్ల దీప్తముగఁ జేయన్ నే సమర్థుండనే?
యిన చంద్రానల తారకా గ్రహగణం బే రీతి నా రీతి నె
వ్వని దీప్తిం బ్రతిదీప్తమయ్యె భువనవ్రాతంబు దద్ధీప్తిచే
ననుదీప్తం బగునట్టి యీశ్వరున కే నశ్రాంతమున్ మ్రొక్కెదన్. | 3 | మత్తేభము |
172 | ఘనగదాభ్యాస చిత్ర సంగతుల మెఱసి
కురుకుమారుల భూరి సంగరము లోన
హతులఁ గావించి వెలసినయట్టి జెట్టి
వాయుతనయుండు గుశలియై వఱలునయ్య? | 5 | తేటగీతి |
357 | ఏల సమస్త విద్యల నొకించుక భాగ్యము గల్గియుండినన్
జాలు, ననేక మార్గముల సన్నుతికెక్క నదెట్లొకో యనన్
రాలకు నేడ విద్యలు తిరంబుగ దేవరరూపు చేసినన్
వ్రాలి నమస్కరించి ప్రసవంబులు పెట్టరె మీఁద భాస్కరా! | 1 | ఉత్పలమాల |
282 | చరణము సోకినట్టి శిలజవ్వనిరూపగు టొక్కవింత, సు
స్ధిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ
స్మరణ దనర్చుమానవులు సద్గతి జెందిన దెంతవింత? యీ
ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ. | 2 | చంపకమాల |
372 | నరనారాయణచరణాం
బురుహద్వయభద్రచిహ్నముద్రితబదరీ
తరుషండమండలాంతర
సరణిన్ ధరణీసురుండు సనఁ జన నెదుటన్. | 0 | కందం |
113 | హరి సర్వేశుఁ డనంతుఁడు
నిరుపమ శుభమూర్తి సేయు నిజభక్త జనో
ద్ధరణము పోషణ మవనీ
వర!యూతు లనంగఁ గర్మవాసన లరయన్. | 0 | కందం |
434 | ఐనన్ గానిమ్ము భవ
ద్దీనతకై వ్రతము విడిచితిన్ బరులకు మే
లైనన్ జాలు శరీరం
బైన నుపేక్షింపవలయు నది యట్లుండెన్. | 0 | కందం |
174 | తెఱఁగొప్పన్ జననీవియోగమునఁ గుంతీస్తన్యపానంబు సో
దర సంరక్షయుఁ గల్గి దేవవిభు వక్త్రస్థామృతంబున్ ఖగే
శ్వరుఁ డర్థిం గయికొన్న మాడ్కిఁ గురువంశశ్రేణి నిర్జించి త
ద్ధరణీరాజ్యముఁ గొన్న మాద్రికొడుకుల్ ధన్యాత్ములే? యుద్ధవా! | 3 | మత్తేభము |
504 | రాజులు కాంతియందు, రతి రాజులు రూపమునందు, వాహినీ
రాజులు దానమందు, మృగ రాజులు విక్రమ కేళియందు, గో
రాజులు భోగమందు, దిన రాజులు సంతత తేజమందు, రా
రాజులు మానమందు, నగరమ్మున రాజ కుమారు లందఱున్. | 1 | ఉత్పలమాల |
213 | తోయజసంభవుఁ డత్తఱి
నేయే ముఖమండలమున నేయే సృష్టిన్
ధీయుతుఁడై సృజియించెను
బాయక యత్తెఱఁగు దెలియఁ బలుకుము నాకున్ | 0 | కందం |
156 | నరవర! వేణుజానలవినష్ట మహాటవిమాడ్కిఁ బాండు భూ
వర ధృతరాష్ట్ర సూను లనివార్య నిరూఢ విరోధ మెత్తి యొం
డొరుల జయింపఁ గోరి కదనోర్విఁ గురుక్షితిపాలముఖ్యు లం
దఱు మృతు లౌటయున్ విని ఘనంబుగ శోకనిమగ్నచిత్తుఁడై. | 2 | చంపకమాల |
47 | అనఘచరిత్ర! మన్మఖము నందు జనించె హయాననాఖ్యతన్
వినుత సువర్ణ వర్ణుఁడును వేదమయుం డఖిలాంతరాత్మకుం
డనుపమ యజ్ఞపూరుషుఁడునై భగవంతుఁడు దత్సమస్త పా
వనమగు నాసికాశ్వసనవర్గములం దుదయించె వేదముల్. | 2 | చంపకమాల |
45 | కాముని దహించెఁ గ్రోధమ
హామహిమను రుద్రుఁ; డట్టి యతికోపము నా
ధీమంతులు గెలిచి రనం;
గామము గెలుచుటలు సెప్పఁగా నేమిటికిన్. | 0 | కందం |
105 | అని యానతిచ్చి “కమలజ!
యెనయఁగ భవదీయమానసేప్సిత మేమై
నను నిత్తు; వేఁడు మనినను
వనరుహసంభవుఁడు వికచవదనుం డగుచున్. | 0 | కందం |
408 | ఒక పెనుఁబాపఱేఁడు చల మొప్ప రసాతలసీమకున్ జకో
రకములు భూతధాత్రికి సురల్ దివికిన్ బగ దీఱునట్లుగా
మెకమెకపాటుతోడ నిను మ్రింగకపో రెపుడున్ ద్రిలోకకం
టకుఁడవు గాన నీయొడలు నజ్జుగఁ జేసి కురంగలాంఛనా. | 2 | చంపకమాల |
81 | హరి మాయా బల మే నెఱుంగ నఁట శక్యంబే సనందాది స
త్పురుషవ్రాతము కైన, బుద్ధి నితరంబున్ మాని సేవాధిక
స్ఫురణం దచ్ఛరితానురాగగుణవిస్ఫూర్తిన్ సహస్రాస్య సుం
దరతం బొల్పగు శేషుఁడుం దెలియఁ డన్నం జెప్ప నే లొండొరున్. | 3 | మత్తేభము |
311 | కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచు చుండు నిక్కము సుమతీ | 0 | కందం |
580 | మేడలు, రచ్చకొట్టములు, మిద్దెలు, మంచెలు, నాటకూటముల్
మాడువు, లంగళుల్, దనుజ మందిరముల్, పుర గోపురావళుల్,
వాడలు, దేవ గేహములు, వప్ర చయంబులు, వేశ వాటికల్,
గోడలు, నాదిగాఁగఁ గపి కుంజరుఁ డప్పుడు చొచ్చి చూచుచున్. | 1 | ఉత్పలమాల |
180 | జననంబందుటలేని యీశ్వరుఁడు దా జన్మించుటెల్లన్ విరో
ధినిరాసార్థము వీతకర్ముఁడగు నద్దేవుండు గర్మప్రవ
ర్తనుఁ డౌటెల్లఁ జరాచరప్రకటభూతశ్రేణులం గర్మవ
ర్తనులం జేయఁదలంచి కాక కలవే దైత్యారికింగర్మముల్. | 3 | మత్తేభము |
212 | మఱియు మఖములు మహితకర్మములుఁ దంత్ర
ములును నడవళ్లు నాశ్రమములుఁ దదీయ
ముఖచతుష్కము నందున పొడమె ననిన
విని మునీంద్రునిఁ జూచి యవ్విదురుఁ డనియె | 5 | తేటగీతి |
300 | ఏఱకుమీ కసుగాయలు,
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ,
పాఱకుమీ రణమందున,
మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ | 0 | కందం |
383 | బహురత్నద్యుతి మేదురోదరదరీభాగంబులన్ బొల్చు ని
మ్మిహికాహార్యమునన్ జరింతు మెపుడుం బ్రేమన్ నభోవాహినీ
లహరీశీతలగంధవాహపరిఖేలన్మంజరీసౌరభ
గ్రహణేందిందిరతుందిలంబు లివి మత్కాంతారసంతానముల్. | 3 | మత్తేభము |
205 | కైకొని యిట్లు పంకరుహగర్భనియంత్రితు లైన రుద్రు లు
ద్రేకముఁ దక్కి కానలకు ధీమతు లై తపమాచరింప న
స్తోక చరిత్రు లేఁగిరి చతుర్ముఖుఁ డంతఁ బ్రపంచకల్పనా
లోకనుఁ డై సృజించె జనలోక శరణ్యుల ధీవరేణ్యులన్. | 1 | ఉత్పలమాల |
3 | క్షంతకుఁ, గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా
రంతకు, నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ
హంతకు, నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్. | 1 | ఉత్పలమాల |
447 | నిను సేవింపగ నాపదల్ పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ
జనమాత్రుండననీ, మహాత్ము డననీ, సంసార మోహంబు పై
కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ
చ్చిన రానీ, యవి నాకు భూషణములే, శ్రీకాళహస్తీశ్వరా! | 3 | మత్తేభము |
279 | పాతకులైన మీకృపకు బాత్రులుకారె తలంచిచూడ, జ
ట్రాతికి గల్గె బావన మరాతికి రాజ్యసుఖంబుగల్గె, దు
ర్జాతికి బుణ్యమబ్బె, గపిజాతి మహత్త్వమునొందె, గావునం
దాతవ యెట్టివారలకు, దాశరథీ కరుణాపయోనిధీ. | 1 | ఉత్పలమాల |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.